సోషల్ మీడియాలో సవాళ్లు వద్దు: రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ కౌంటర్

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

చర్చల కోసం సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం సరికాదని, దానికి అసలైన వేదిక పార్లమెంట్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విసిరిన సవాల్ పై ఆమె తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్ లో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేతలు వాకౌట్లు చేస్తున్నారని ఎద్దేవా చేస్తూ, దమ్ముంటే ఆధారాలతో సహా సభకు రావాలని ఆమె సవాల్ విసిరారు.