దళిత మహిళకు న్యాయం కోరుతూ ఆత్మకూరులో నిరసన గళం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఆత్మకూరు
ఆత్మకూరులో దళిత మహిళ భూమి కబ్జా వివాదంపై డీఎస్పీ కార్యాలయం ఎదుట శనివారం నిరసన చేపట్టారు. ఏఎస్పేట మండలం చిరమున గ్రామానికి చెందిన సుమతి భూమిలో జామాయిల్ మొక్కలను తొలగించి, కులం పేరుతో దూషించారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంతో ప్రజాసంఘాలు ఆందోళన నిర్వహించాయి. స్పందించిన డీఎస్పీ బాధ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.