ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జోరు: జమ్మలమడుగులో అత్యధికంగా ఓటింగ్
రిపోర్టర్: వెంకట్
స్థలం: Kadapa
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉదయం పదకొండు గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా ఇరవై రెండు శాతానికి పైగా ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో అరువై శాతానికి పైగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారని, పలు పట్టణాల్ లో ఓటర్లు బారులు తీరారని అధికారులు స్పష్టం చేశారు.