'టాటా సన్స్ భవిష్యత్తు కోసం రీఅపాయింట్‌మెంట్': ఎన్. చంద్రశేఖరన్ నిర్ణయంపై బోర్డు కీలక ప్రకటన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: మహారాష్ట్ర
టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ మరో ఐదేళ్ల కాలానికి తిరిగి నియమితులయ్యారు. గతంలో వైదొలుగుతున్నట్లు ప్రకటించినప్పటికీ, నామినేషన్ రెమ్యునరేషన్ కమిటీ మరియు బోర్డు సభ్యుల ప్రత్యేక అభ్యర్థన మేరకు ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు గురువారం జరిగిన సమావేశంలో బోర్డు మెజారిటీ ఓటుతో ఆయన పునరుద్ధరణను ఖరారు చేసింది. ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత తదుపరి ఐదేళ్ల పాటు ఆయన ఈ బాధ్యతలలో కొనసాగనున్నారు.