ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Telangana

సిరిసిల్ల పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుపై Bharat Rashtra Samithi (BRS) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేతన్నలను ఆదుకునే పథకాలు ప్రకటిస్తారని ఆశపడితే, సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ తన పాత పద్ధతిలోనే వీధి రౌడీలా మాట్లాడారని ఆ పార్టీ మండిపడింది. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన హుందాతనం ఆయన ప్రసంగంలో ఏమాత్రం కనిపించలేదని, కుక్క తోక వంకర అన్నట్లుగా అసభ్య పదజాలంతో ఆయన తీరు మారలేదని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.