కుమారుడి ప్రాణాపాయ అలెర్జీ అనుభవంతో విరాళాల సేకరణకు బ్రిటనీ మహోమ్స్ ముందుకు

రిపోర్టర్: విజయ్ స్థలం: Kansas City

కుమారుడి తీవ్ర అలెర్జీ ప్రమాదం నుంచి గుణపాఠం నేర్చుకున్న బ్రిటనీ మహోమ్స్ ఆహార అలెర్జీల పరిశోధన సంస్థకు మద్దతుగా నిలిచారు. ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషన్ బ్రాండ్ ఓవిన్ తో కలిసి ఫుడ్ అలర్జీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థ కోసం భారీ విరాళాల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించినట్లు బ్రిటనీ మహోమ్స్ తెలిపారు. లక్ష డాలర్ల వరకు విరాళాలను మ్యాచింగ్ చేసే ఈ కార్యక్రమంలో భాగంగా ఇతర కుటుంబాలకు అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు.