కాంగ్రెస్ సర్కార్ తీరుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర నిప్పులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Hyderabad
మంత్రి పదవి ఇస్తామని చెప్పి తనను మోసం చేశారంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. గట్టుప్పల్ మండలంలో పర్యటించిన ఆయన, సొంత ప్రభుత్వంలో నిధులు రాక ప్రతిపక్ష ఎమ్మెల్యేలా పోరాడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి జరగకపోతే ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసేందుకైనా వెనుకాడబోనని స్పష్టం చేయడం రాష్ట్ర రాజకీయాల్ లో తీవ్ర కలకలం రేపింది.