'దేశ సమగ్రతను కాపాడుకోవడం మన కర్తం': సి.పి. రాధాకృష్ణన్
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ అమర జవాన్ల స్మారకం వద్ద నివాళులర్పించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేంద్ర సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించిన ఆయన, తెలంగాణ విమోచన పోరాటంలో ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను స్మరిస్తూ దేశ సమగ్రతను కాపాడుకోవడం మన ప్రాథమిక కర్తవ్యమని ఉద్ఘాటించారు.