స్విట్జర్లాండ్ కాదంటూ ఏపీ అందాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వీడియో వైరల్

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

ఇది స్విట్జర్లాండ్ కాదు మన ఆంధ్రప్రదేశే అంటూ రాష్ట్ర అందాలను వివరిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమాలలో పంచుకున్న ఒక వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నామని అధికారులు వెల్లడించారు.