అక్షర కోవెలలో డిజిటల్ వెలుగులు నింపిన గ్రామ యువత

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: పొదలకూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని బి.చెర్లోపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు గ్రామ యువత ఆధునిక టీవీని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శోభనాద్రి రిబ్బన్ కట్ చేయగా, మరొక అధికారి రమేష్ టీవీని ప్రారంభించారు. డిజిటల్ మాధ్యమం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు యువత ముందుకు రావడం అభినందనీయమని అధికారులు కొనియాడారు. అనంతరం విద్యాశాఖ అధికారులను, ఉపాధ్యాయులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి, రమణారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు సుధాకర రావు, సీఆర్పీ కృష్ణయ్య పాల్గొన్నారు.