పొగాకు రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
రిపోర్టర్: నరేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో గిట్టుబాటు ధరల్లేక ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆఫ్-స్టైల్, లో-గ్రేడ్ పొగాకు రకాలకు క్వింటాలుకు అదనంగా రూ. 1,000 ప్రోత్సాహకంగా అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ మొత్తాన్ని వ్యాపారులు కొనుగోలు చేసిన తొమ్మిది రోజుల్లోగా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. వివిధ గ్రేడ్లకు కనీస ధరలు ఖరారు చేశామన్నారు.