హైదరాబాద్ లో భారీ సైబర్ మోసం గుట్టురట్టు: నలుగురు నిందితుల అరెస్ట్
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కాల్ సెంటర్ల ద్వారా వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు. ఈ కుంభకోణంలో ఇప్పటివరకు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని, డిజిటల్ రికార్డుల ఆధారంగా రెండు వందల అరవై కోట్ల రూపాయలకు పైగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఎడీ అధికారులు గుర్తించారని దర్యాప్తు వర్గాలు స్పష్టం చేశాయి.