వెలగపూడి సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ

రిపోర్టర్: హరి స్థలం: వెలగపూడి

వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ కీలక భేటీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు సహచర మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు రాబోయే సంక్షేమ ప్రణాళికలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తున్నట్లు సమాచారం.