మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై దేశవ్యాప్త ఆందోళనలకు దిగనున్న బీజేపీ

రిపోర్టర్: సునీల్ స్థలం: న్యూఢిల్లీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దివంగత తండ్రిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సోమవారం దేశవ్యాప్త నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజకీయ చర్చల హద్దులను మీరి వ్యక్తిగత దూషణలకు దిగడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.