వైద్య సిబ్బందికి భారీ షాక్: ఇరవై రెండు రోజులుగా కొనసాగుతున్న ఎన్ హెచ్ ఎం సమ్మె

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

తెలంగాణలో జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం గడిచిన ఇరవై రెండు రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నట్లు జేఏసీ నాయకులు వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న పదిహే వేలకు పైగా సిబ్బంది సమ్మె బాటపట్టడంతో రోగులకు వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి షరతులు లేకుండా తమ సేవలను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.