భారత మార్కెట్లో అనూహ్యంగా పెరిగిన 4G ఫోన్ల విక్రయాలు
రిపోర్టర్: సునీల్
స్థలం: India
మెమరీ చిప్‌ల ధరలు భారీగా పెరగడంతో 5G ఫోన్ల తయారీ వ్యయం పెరిగి, సామాన్యులకు భారంగా మారింది. దీంతో బడ్జెట్ ధరలో లభించే 4G ఫోన్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా 2026 రెండో త్రైమాసికంలో 4G ఫోన్ల షిప్‌మెంట్లు 40 శాతం వృద్ధిని నమోదు చేశాయి. చిప్‌ల ధరలు తగ్గే వరకు ఈ ట్రెండ్ కొనసాగుతుందని, ఇది తాత్కాలిక మార్పు మాత్రమేనని టెక్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.