యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం

రిపోర్టర్: శివ స్థలం: Hyderabad

తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణ కోసం కొత్త పథకాన్ని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో నిలిచిపోయిన ఈ ప్రక్రియ వల్ల 12 వేలకుపైగా కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. తాజాగా ఈ ఫైళ్లకు మోక్షం లభించడంతో వేలాది కుటుంబాలకు లబ్ధి చేకూరడంతో పాటు ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది.