స్మార్ట్‌ఫోన్ల కోసం కొత్త కలర్ఓఎస్ 17 యూజర్ ఇంటర్‌ఫేస్ లాంచ్ చేసిన ఒప్పో

రిపోర్టర్: విజయ్ స్థలం: చైనా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో గురువారం తన తాజా కలర్ఓఎస్ 17 యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఆధారితంగా రూపొందించిన ఈ కొత్త సాఫ్ట్‌వేర్ ఫ్లూయిడ్ డిజైన్ లాంగ్వేజ్‌తో ఒప్పో, వన్‌ప్లస్, రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులోకి రానుంది. ఈ అప్‌డేట్‌లో పోలార్ లైట్ ఇంజిన్, టైడల్ ఇంజిన్ వంటి అధునాతన ఫీచర్లతో పాటు ఒప్పో ఏఐ అసిస్టెంట్ ను కూడా సంస్థ పరిచయం చేసింది. చైనాలో త్వరలో దీని స్టేబుల్ వెర్షన్ విడుదల కానుండగా, ఒప్పో ఫైండ్ ఎక్స్ సిరీస్ ఫోన్లకు తొలుత ఈ అప్‌డేట్ అందనుంది.