విద్యార్థులకు అలర్ట్: సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ గడువు పెంపు
రిపోర్టర్: రాజేష్
స్థలం: న్యూఢిల్లీ
కేంద్ర విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2026 రిజిస్ట్రేషన్ గడువును నవంబర్ ఆరవ తేదీ వరకు పొడిగించినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యువతలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ వేదిక దోహదపడుతుందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువకులు తమ గ్రామాలు మరియు పట్టణాల్ లోని సమస్యలను గుర్తించి వినూత్న పరిష్కారాలు చూపాలని పిలుపునిచ్చారు. ఎంపికైన వారికి ప్రత్యేక రివార్డులు, పెట్టుబడి అవకాశాలు లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.