మనుబోలులో వినాయక నవరాత్రి వేడుకల ముగింపు లడ్డు వేలంపాట

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని వినాయక గుడి వద్ద తొమ్మిది రోజులుగా పూజలందుకున్న స్వామివారి లడ్డు, డబ్బుల దండ, వెండి కాయిన్ వేలం పాటను నిమజ్జనం సందర్భంగా నిర్వహించనున్నారు. ఈ వేలంపాటలో గ్రామ, మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.