పీఎఫ్ ఉద్యోగులకు గుడ్ మార్క్ వేతన పరిమితి పెంపు
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ పరిధిలోని తప్పనిసరి కవరేజీకి ఉన్న నెలవారీ వేతన పరిమితిని పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా అదనపు ఉద్యోగులు సామాజిక భద్రతా పరిధిలోకి వస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మార్పుతో ఉద్యోగుల పీఎఫ్ వాటాతో పాటు పెన్షన్ లెక్కింపు కూడా మారుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.