'ఈ నెల 21న తుది విచారణ': సాయికృష్ణ అదృశ్యం కేసులో హైకోర్టు స్పష్టత

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై ఈ నెల 21న తుది విచారణ జరుపుతామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అదృశ్యంపై తల్లి విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించగా, పోలీసుల తరఫు వాదనలు విన్న ధర్మాసనం అన్ని వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశించింది. దర్యాప్తు కీలక దశలో ఉందని, నిందితులైన పోలీసులను అరెస్ట్‌ చేశామని పోలీసులు తెలిపారు. కేసును సీబీఐకి అప్పగించాలని తల్లి కోరుతుండగా, సిట్ నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తోందని పోలీసులు పేర్కొన్నారు.