గోపన్‌పల్లి తండాలో మట్టి డంపింగ్‌పై స్థానికుల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రమేష్
స్థలం: రంగారెడ్డి
శేరిలింగంపల్లి పరిధిలోని గోపన్‌పల్లి తండాలో నల్లగండ్ల చెరువు పూడికతీత మట్టిని డంపింగ్ చేస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలంలో ముప్పై అడుగుల ఎత్తున మట్టి కుప్పలు పోయడంతో తమ ఇండ్లకు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని తండావాసులు వాపోయారు. భారీ వర్షాలు కురిస్తే మట్టి జారి ఇండ్లపైకి వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. బాధితులకు అండగా మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరిశంకర్ యాదవ్ నిలిచారు.