యూపీలో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్థాన్‌కు వణుకు పుట్టిస్తున్నాయని అమిత్ షా స్పష్టీకరణ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: న్యూఢిల్లీ
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం దేశ రక్షణ సామర్థ్యాల అభివృద్ధిలో కీలకంగా మారిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో జరిగిన ఉత్తర్ ప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యూపీలో తయారవుతున్న బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు పాకిస్థాన్‌కు నిద్రలేని రాత్రులు కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అమేథీలో తయారవుతున్న ఏకే-203 అసాల్ట్ రైఫిల్స్ ఉగ్రవాదులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని షా తెలిపారు.