'ఎల్‌నినో దెబ్బతో కృష్ణమ్మకు కష్టకాలం': నీటి కటకటతో ఆవిరవుతున్న రైతుల ఆశలు

రిపోర్టర్: మహేష్ స్థలం: శ్రీశైలం

ఎల్‌నినో ప్రభావంతో కృష్ణా పరీవాహక ప్రాంతంలో తీవ్ర నీటి కటకట ఏర్పడి శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలు కళ తప్పాయి. వర్షాభావం కారణంగా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వరద ప్రవాహాలు తగ్గిపోవడంతో రాయలసీమలో ఆయకట్టుకు సాగునీరు అందక రైతుల ఆశలు ఆవిరయ్యాయి. కర్నూలు, కడప సహా వివిధ కాలువల కింద లక్షలాది ఎకరాల్లో సాగు పూర్తిగా దెబ్బతిన్నది. కేవలం తాగునీటి అవసరాలకే నీటిని కేటాయించాలని కేఆర్‌ఎంబీ సూత్రప్రాయంగా నిర్ణయించడంతో, మిగిలిన నీటిని చెరువుల నింపేందుకే పరిమితం చేశారు.