నిషేధిత జాబితాలోని ఆస్తుల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో ప్లానింగ్ అథారిటీల అనుమతులు పొంది సాంకేతిక లోపాలు లేదా రెవెన్యూ వర్గీకరణల వల్ల సెక్షన్ 22ఏ నిషేధిత జాబితాలో నిలిచిపోయిన ఆస్తుల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. ఈ మేరకు అర్హత కలిగిన ఆస్తులకు నేరుగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని స్పష్టం చేస్తూ రెవెన్యూ శాఖ అన్ని జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది.