రేణిగుంటలో ఘనంగా అంతర్జాతీయ అక్షరాస్యత వారోత్సవాల ప్రారంభం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రేణిగుంట
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా రేణిగుంట మండలంలోని గుత్తివారిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో రాష్ట్రీయ సేవా సమితి ఆధ్వర్యంలో అక్షరాస్యత వారోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. యునెస్కో పిలుపు మేరకు విద్యార్థుల్లో చదవడం, రాయడం పట్ల అవగాహన కల్పించేందుకు వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రాస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, అక్షరాస్యత అనేది జీవితాన్ని మార్చే శక్తి అని, విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అక్షరాస్యత ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.