కుమారస్వామి అధికారిక నివాసంలోనే కుట్ర: సిద్ధరామయ్య ఫేక్ వీడియో కలకలం

రిపోర్టర్: సునీల్ స్థలం: Bengaluru

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర తప్పుడు వీడియోను అప్లోడ్ చేయడానికి వాడిన మొబైల్ ఫోన్ కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి అధికారిక ఢిల్లీ నివాసంలోనే చేతులు మారిందని బెంగళూరు పోలీసు కమీషనర్ సీమంత్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఈ కేసులో అరెస్టయిన నిందితుడు రితేష్ పాండే విచారణలో ఈ విషయాన్ని అంగీకరించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు.