భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం: ముసాయిదా ఆఖరి దశకు చేరిందని వెల్లడి

రిపోర్టర్: మహేష్ స్థలం: న్యూఢిల్లీ

భారత్ అమెరికా దేశాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మొదటి విడత డ్రాఫ్టింగ్ ఆఖరి దశకు చేరుకున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పోటీ దేశాల కంటే మెరుగైన పన్ను ప్రయోజనం లభిస్తేనే ఈ ఒప్పందంపై ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఎగుమతిదారులకు పూర్తిస్థాయిలో లబ్ధి చేకూరేలా అన్ని అంశాలపై చర్చిస్తున్నట్లు అధికారులు తెలిపారు.