రాప్తాడులో దారుణం: పాఠశాలలో విద్యార్థినిపై రంపంతో ఉన్మాది భీకర దాడి
రిపోర్టర్: కిరణ్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి బాలికపై ఉన్మాది రంపంతో దాడి చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. తీవ్ర గాయాలైన విద్యార్థినిని మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్ లో బెంగళూరు కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి, దోషిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.