పనామా జట్టుతో జరిగిన ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచ్ డ్రా

రిపోర్టర్: రమేష్ స్థలం: బెంగళూరు

ఫిఫా ర్యాంకింగ్స్లో ముందంజలో ఉన్న పనామా జట్టుతో బెంగళూరు వేదికగా జరిగిన అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లో భారత్ ఒకటి - ఒకటి తేడాతో డ్రా సాధించిందని కోచ్ ఖాలిద్ జమీల్ వెల్లడించారు. తొలి అర్ధభాగంలో రయాన్ విలియమ్స్ గోల్ చేసి భారత్కు ఆధిక్యాన్ని అందించగా, రెండో అర్ధభాగంలో పనామా ఆటగాడు ఒమర్ వాలెన్సియా గోల్ చేసి స్కోరును సమం చేశారని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఫలితం భారత జట్టుకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు.