అనంతపురంలో రాక్షస దాడి నిందితుడు హేమంత్ ఎన్కౌంటర్: తీవ్ర గాయాలు
రిపోర్టర్: మహేష్
స్థలం: Anantapur
అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై చెయిన్సా తో దాడి చేసి పరారైన నిందితుడు హేమంత్ ఆత్మకూరు అడవుల ప్రాంతంలో పోలీసుల ఎదురుకాల్పుల్ లో తీవ్రంగా గాయపడ్డాడని అనంతపురం ఎస్పీ పి. జగదీష్ వెల్లడించారు. పోలీసుల అదుపు నుంచి తప్పించుకునేందుకు యత్నించి కత్తితో దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు ఆయన స్పష్టం చేశారు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.