పుర ఎన్నికల్ లో కూటమి ఘన విజయం: పట్టణాల్ లో హోరెత్తిన సంబరాలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
అమరావతి ప్రాంతంలో జరిగిన పుర ఎన్నికల్ లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిందని, పట్టణ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని అధికారులు తెలిపారు. గత రెండున్నరేళ్ల కాలంలో నగరాలు, పట్టణాల్ లో రూ.వేల కోట్ల వ్యయంతో మౌలిక వసతుల కల్పన, అన్న క్యాంటీన్లు, టిడ్కో గృహాల నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. వైకాపా పాలనా వైఫల్యాలతో విసిగిపోయిన పుర ప్రజలు, ప్రస్తుత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఓటేసి భారీ విజయాన్ని అందించడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.