వినాయక నిమజ్జన ప్రాంతాల్లో రేణిగుంట డీఎస్పీ పర్యటన.. పటిష్ట భద్రతా ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు!

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలో వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు, కోడూరు రూరల్ సీఐ డి. శ్రీనివాసులతో కలిసి బుధవారం ఓబుళవారిపల్లి మండలం మంగంపేట చెరువు, చిట్వేల్ మండలం ఎల్లంరాజు చెరువు వద్ద నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.