ఓటర్ల జాబితా తప్పులు సవరించాలని బీఆర్ఎస్ పోరాటం

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

ఎస్ఐఆర్ ప్రక్రియలోని లోపాలను సరిదిద్దాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పోరాడుతోందని మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కే అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ లేవనెత్తిన అభ్యంతరాలపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సానుకూలంగా స్పందించినట్లు ఆయన వెల్లడించారు.