మహాత్మా గాంధీ మార్గం అందరికీ ఆదర్శం: ఎస్పీ మహేశ్వర రెడ్డి
రిపోర్టర్: రమేష్
స్థలం: శ్రీకాకుళం
మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస మరియు శాంతి మార్గాలు నేటి సమాజానికి సైతం అత్యంత ఆదర్శనీయమని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి వెల్లడించారు. జాతిపిత జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం గాంధీ చేసిన త్యాగాలను స్మరించుకోవాలని సూచించారు. శాంతియుత జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.