యూఎస్ ఓపెన్ సెమీస్‌లోకి సబాలెంకా ప్రవేశం

రిపోర్టర్: అశోక్ స్థలం: World

యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అరినా సబాలెంకా సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్ పోరులో సబాలెంకా 7-6, 3-6, 7-6 తేడాతో లిండా నోస్కోవాను ఓడించింది. చివరి వరకు పోరాడిన నోస్కోవా గట్టి పోటీనిచ్చినప్పటికీ, నిర్ణాత్మక మూడో సెట్‌లో సబాలెంకా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి విజయం సాధించింది. ఈ విజయంతో సబాలెంకా తన వరుస టైటిల్ పోరు అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.