అనుమతి లేని ధర్నాలకు ఉద్యోగులు దూరంగా ఉండాలంటూ ఎస్పీ హెచ్చరిక

రిపోర్టర్: మహేష్ స్థలం: నంద్యాల

విజయవాడలో నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతున్న సచివాలయ ఉద్యోగుల ధర్నాకు ఎలాంటి అనుమతి లేదని, ప్రభుత్వ ఉద్యోగులు అటువంటి నిరసనలకు దూరంగా ఉండాలని నంద్యాల ఎస్పీ స్పష్టం చేశారు. ఈ మేరకు నంద్యాల జిల్లా పోలీసు శాఖ అధికారికంగా హెచ్చరికలు జారీ చేసిందని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించి చట్టవిరుద్ధమైన కార్యక్రమాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.