బీసీలకు తీపి కబురు: పార్టీ పరంగా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు
రిపోర్టర్: కిరణ్
స్థలం: అమరావతి
బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని, చట్టపరంగా సాధ్యపడకపోయినా పార్టీ పరంగా అమలు చేస్తామని తెలుగు దేశం పార్టీ స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్లు కోల్పోయినప్పటికీ, బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలుగు దేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని నేతలు పేర్కొన్నారు.