నర్సీపట్నంలో కూటమి వైఫల్యాలను ఎండగడుతూ హోరెత్తిన వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
నర్సీపట్నంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిర్వహించిన ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ తో కలిసి అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందన తమ విజయానికి బాటలు వేస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు.