అనర్హత పిటిషన్లపై గడువు కోరడంపై ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఫైర్

రిపోర్టర్: విజయ్ స్థలం: కోల్‌కతా

అనర్హత పిటిషన్లపై ఎంపీలు గడువు కోరడంపై తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారి దగ్గర ఎలాంటి సమాధానం లేకపోవడంతోనే నిరవధిక గడువు కోరాలని ఎద్దేవా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మరియు నిధులతోనే వారు గెలిచారని, మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీల నాయకత్వాన్ని విస్మరించి మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.