అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: గోపి స్థలం: Amaravati

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెంలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ నూతన ప్రాంగణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఘనంగా భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అమరావతిలో రూపుదిద్దుకుంటున్న ఈ కంటి ఆసుపత్రి ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతోందని స్పష్టం చేస్తూ, ఈ ప్రతిష్టాత్మక సంస్థ కోసం 12 ఎకరాల భూమిని కేటాయించినట్లు సీఎం వెల్లడించారు.