రూ.4.50 కోట్ల కరెన్సీ నోట్లతో నందిగామలో వినాయక అలంకరణ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఎన్టీఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాసవి మార్కెట్‌లో 44వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గణపతిని రూ.4.50 కోట్ల కరెన్సీ నోట్లతో అత్యంత వైభవంగా అలంకరించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీంతో గణేశుడిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.