అమరావతి: హైలో ఓపెన్ విజేత పీవీ సింధుకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు హైలో ఓపెన్-2026 టోర్నమెంట్ లో విజేతగా నిలిచి సీజన్ లో రెండో టైటిల్ కైవసం చేసుకున్నారని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ అపురూప విజయం ఆంధ్రప్రదేశ్ తో పాటు యావత్ భారతదేశానికే ఎంతో గర్వకారణమని ఆయన కొనియాడారు. కఠిన శ్రమ, పట్టుదలతో సాగిన సింధు ప్రయాణం రాబోయే తరాల యువ అథ్లెట్లకు ఎప్పటికీ గొప్ప ప్రేరణగా నిలుస్తుందని లోకేశ్ ఆకాంక్షించారు.