రోడ్డు ప్రమాదం నుంచి కోలుకోవడంపై సాయి దుర్గా తేజ్ భావోద్వేగ పోస్ట్
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
రోడ్డు ప్రమాదం జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మెగా హీరో సాయి దుర్గా తేజ్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. తనకు జీవితంలో రెండో అవకాశం లభించిందని, కుటుంబ సభ్యులు, అభిమానుల ప్రేమ వల్లే తాను మళ్లీ నిలబడగలిగానని తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం ఆయన 'సంబరాల ఏటిగట్టు' చిత్రంలో నటిస్తున్నారు.