స్థానిక సంస్థల ఎన్నికలు: నెల్లూరులో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాట్లు

రిపోర్టర్: సురేష్ స్థలం: నెల్లూరు

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు నెల్లూరు జిల్లాలో పోలీసు శాఖ పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. నగరపాలక సంస్థతో పాటు పలు మున్సిపాలిటీల్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేపడుతున్నామని వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సుమారు రెండు వేల మందిని బైండోవర్ చేయడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్ లో ప్రత్యేక నిఘా ఉంచామని అధికారులు స్పష్టం చేశారు.