రాయ్‌గఢ్ బీచ్‌లో విషాదం: అలల తాకిడికి ఎనిమిది మంది విద్యార్థులు దుర్మరణం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: రాయ్గఢ्
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా బీచ్‌లో విహారయాత్రకు వెళ్లిన ప్రైవేట్ కోచింగ్ సెంటర్ విద్యార్థులలో సముద్రపు రాకాసి అలల తాకిడికి ఎనిమిది మంది గల్లంతై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు సరదాగా ఈత కొడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనతో విద్యార్థుల కుటుంబాలలో తీవ్ర శోకం అలుముకుందని అధికారులు వెల్లడించారు.