డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణకు సిద్ధమంటూ జగన్కు సోమిరెడ్డి సవాల్

రిపోర్టర్: గోపి స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియపై సీబీఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు ఆపాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసింది ఎవరో నిరూపించేందుకు ఈ విచారణ ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. దీనిపై వైసీపీ నేతలు తక్షణమే స్పందించి బహిరంగ చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.