వైరల్ పోస్ట్: భర్త ఉద్యోగం పోవడంతో భార్యతో పోటీపడుతున్న వైనం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

ఉద్యోగం కోల్పోయిన భర్త తన కెరీర్ ఎదుగులను చూసి ఓర్వలేకపోతున్నాడని ఓ మహిళ బ్లైండ్ అనే నెట్వర్కింగ్ వేదిక ద్వారా ఆవేదన వ్యక్తం చేసినట్లు నిపుణులు తెలిపారు. తమది ఇంజనీర్ దంపతుల జంట అని, భర్తకు జాబ్ పోవడంతో తన ఉద్యోగ ప్రయత్నాలను అతడు పోటీగా భావిస్తున్నాడని ఆమె వాపోయారు. తన విజయాలను చూసి ఈర్ష్య పడుతున్నాడని, భర్త కోసం తన భవిష్యత్తును త్యాగం చేసేది లేదని స్పష్టం చేశారు.