'నిత్యావసరాల ధరలు పెరగకముందే తగిన చర్యలు చేపట్టాలి': సీఎం చంద్రబాబు

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

నిత్యావసరాల ధరలు పెరగకముందే అంచనా వేసి ఉత్పత్తి, సరఫరా, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అమరావతిలో అధికారులను ఆదేశించారు. అవసరమైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ధరల్ని అందుబాటులో ఉంచాలని, హై రిస్క్ ఉద్యాన పంటల రక్షణకు రూ. 190 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైతుబజార్లు, రేషన్ డిపోల ద్వారా దాదాపు 60 రకాల నిత్యావసర సరకులను అందుబాటులోకి తేవాలని, ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.